కాంగ్రెస్ లోకి దానం బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే ఝలక్
బీఆర్ఎస్ పార్టీకి నేతలు షాకుల మీద షాకులిస్తున్నారు. అధికారం పోవడంతో ఒక్కరొక్కరుగా సైలెంట్‌గా ఏదో ఓ కారణం చెబుతూ పార్టీని వీడిపోతున్నారు.
నా తెలంగాణ, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి నేతలు షాకుల మీద షాకులిస్తున్నారు. అధికారం పోవడంతో ఒక్కరొక్కరుగా సైలెంట్‌గా ఏదో ఓ కారణం చెబుతూ పార్టీని వీడిపోతున్నారు. శుక్రవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్బీఆర్ఎస్ ను వీడారు. ఆదివారం కాంగ్రెస్‌పార్టీలో దానం చేరనున్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీ దీపాదాస్మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దానం చేరికను వీరంతా స్వాగతించారు. గతంలో హస్తం పార్టీతోనే రాజకీయ ప్రయాణం ప్రారంభించిన దానం తాజాగా మళ్లీ అదే పార్టీకి వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌పార్టీలో గతంలో మంత్రిగా కూడా పనిచేశారు.