ఐడీఎఫ్​ దాడి.. హిజ్బొల్లా చీఫ్​ నస్రుల్లా, కూతురు జైనబ్​ మృతి

అమెరికా పర్యటన రద్దు చేసుకొని ఇజ్రాయెల్​ కు నెతన్యాహు 30వరకు ఎమర్జెన్సీ ప్రకటన

Sep 28, 2024 - 14:44
 0
ఐడీఎఫ్​ దాడి.. హిజ్బొల్లా చీఫ్​ నస్రుల్లా, కూతురు జైనబ్​ మృతి

జేరూసలెం: హిజ్బొల్లా చీఫ్​ హసన్​ నస్రుల్లా ను హమార్చామని ఐడీఎఫ్​ ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో లెబనాన్​ లోని బీరూట్​ లో ఐడీఎఫ్​ దాడులతో విరుచుకుపడింది. హిజ్బొల్లా ముఖ్య నాయకులు సమావేశమయ్యే భవనాలు బీరూట్​ లోనే ఉన్నాయి. ఐడీఎఫ్​ వీటినే టార్గెట్​ చేసింది. ఈ దాడుల్లో నస్రుల్లాతోపాటు ఆయన కూతురు జైనబ్​, మరో నలుగురు మృతి చెందారని ఐడీఎఫ్​ చీఫ్​ డేనియల్​ హగారీ తెలిపారు. ఈ వైమానిక దాడుల్లో 90మందికి గాయాలయ్యాయని తెలిపారు. ఇజ్రాయెలీల సురక్షితంగా జీవించేందుకు అనువైన పరిస్థితులు ఉండాలన్న లక్ష్యంతోనే ఈ ఉగ్రవాద సంస్థలపై దాడులు చేస్తున్నామని తెలిపారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా నాశనం చేసే వరకు వదలబోమన్నారు. మరోవైపు 27న అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నెతన్యాహు విషయం తెలుసుకొని తన పర్యటనను రద్దు చేసుకుని ఇజ్రాయెల్​ కు వచ్చారు. అనంతరం రక్షణ శాఖాధికారులతో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్​ లో 30వ తేదీ వరకు ఎమర్జెన్సీని ప్రకటించారు.