రక్షణ రంగానికి రూ. 6,21,940 కోట్లు
Defense Rs. 6,21,940 crores
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రక్షణ రంగానికి ఈసారి బడ్జెట్ లో స్వల్ప పెరుగుదలను ప్రకటించారు. మంగళవారం ప్రకటించిన బడ్జెట్ లో రక్షణ శాఖకు రూ. 6,21,940 కోట్లు కేటాయించారు. ఇది తం కంటే ర. 400 కోట్లు ఎక్కువ. జీతాలు, పెన్షన్ లపైనే అధిక భాగం 67 శాతం ఖర్చు చేయనున్నారు.
రక్షణ శాఖలో నాలుగు భాగాలు రెవెన్యూ, క్యాపిటల్, పెన్షన్, రక్షణ మంత్రిత్వ శాఖకు కేటాయింపులు ఉండనున్నాయి.
కాగా 2004లో యూపీఏ హయాంలో మన్మోహన్ సిగ్ రూ. 77 వేల కోట్ల రక్షణ శాఖ బడ్జెట్ ను కేటాయించారు. చివరగా 2013లో రూ. 2.03 కోట్లుగా రక్షణ శాఖకు కేటాయింపులు చేశారు.
ప్రధానమంత్రి మోదీ 2014లో తొలిసారిగా 2.18 కోట్లను రక్షణ రంగానికి కేటాయించారు. అనంతరం భారీగా బడ్జెట్ ను పెంచుతూ ప్రస్తుతం రక్షణ రంగానికి రూ. 6,21,940 కోట్లు కేటాయించారు.