పేకాట స్థావరం పై పోలీసుల దాడి 

38 వేల రూపాయల నగదు, 02 ద్వి చక్ర వాహనాలు, 05 మొబైల్స్ స్వాధీనం

Jul 23, 2024 - 21:13
 0
పేకాట స్థావరం పై పోలీసుల దాడి 

నా తెలంగాణ, డోర్నకల్: విశ్వసనీయ సమాచారం మేరకు మహబూబాబాద్​ జిల్లా కేంద్ర టౌన్​ పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. మంగళవారం సాయంత్రం జరిపిన ఈ దాడిలో ఎస్​.ఐ విజయ్​ కుమార్​ ఆధ్వర్యంలో సిబ్బంది పాల్గొన్నారు. పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 38 వేల నగదు, రెండు బైకులు, ఐదు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్​ ఐ తెలిపారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన వారి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.