ఇరాన్​ గూడఛారి సమాచారం నస్రుల్లా మృతికి కారణం!

Iran spy information is the reason for the death of Nasrullah!

Sep 30, 2024 - 18:37
 0
ఇరాన్​ గూడఛారి సమాచారం నస్రుల్లా మృతికి కారణం!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: హిజ్బొల్లా చీఫ్​ నస్రుల్లా దక్షిణ బీరూట్​ లో అండర్​ గ్రౌండ్​ లో ఉన్న సమాచారాన్ని ఇరాన్​ కు చెందిన ఓ గూడఛారి అమెరికా/ఇజ్రాయెల్​ కు అందించినట్లు తెలుస్తోంది. ఈ గూడఛారిని నస్రుల్లా భద్రత కోసం ఇరాన్​ నియమించినట్లుగా సమాచారం. బీరూట్​ లోని 60 అడుగుల లోతులో ఉన్న బంకర్​ లో నస్రుల్లా సమావేశం కాబోతున్నారన్న ఖచ్చితమైన సమాచారం, తేదీ, సమయంతో సహా అందించాడని తెలుస్తోంది. ఈ బంకర్​ హిజ్బొల్లాకు సెంట్రల్​ కమాండ్​ హెడ్​ క్వార్టర్​ కావడం విశేషం. ఇతని సమాచారంతోనే ఇజ్రాయెల్​ ఒకేసారిగా 85 టన్నుల బాంబులను ఆ ప్రాంతంలో ప్రయోగించింది. అయితే ఇజ్రాయెల్​ ప్రయోగించిన ఈ బాంబులు ప్రత్యేకమైనవి. వీటిని బంకర్​ బస్తర్​ బాంబులుగా పిలుస్తారు. ఈ బాంబులు భూమిపై పేలవు. నేరుగా భూమిలోకి చొచ్చుకొని వెళతాయి. అనంతరం పేలతాయి. ఏది ఏమైనా హిజ్బొల్లాను పెంచి పోషిస్తున్న ఇరాన్​ కు ఈ గూడఛారి ఇచ్చిన సమాచారం దడపుట్టించేలా చేసింది. ఓ ఉగ్ర అగ్రనేతను కోల్పోయింది. మరోవైపు ఇరాన్​ అధ్యక్షుడు అయతుల్లా ఖమేనీ ఇంకా అండర్​ గ్రౌండ్​ లో ఉన్నారు. ఇజ్రాయెల్​ పై దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారు.