ఉగ్ర నిర్మూలనకు ఏఐ సాంకేతికత కెమెరాల ఏర్పాటు

Installation of AI technology cameras for extermination

Nov 6, 2024 - 18:10
 0
ఉగ్ర నిర్మూలనకు ఏఐ సాంకేతికత కెమెరాల ఏర్పాటు

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్ లోని ఉగ్రవాద నిర్మూలనకు భద్రతా దళాలు ఏఐ సాంకేతికతతో కూడిన కెమెరాలను ఉపయోగిస్తున్నారు. లోయలో పెరుగుతున్న ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రత్యేక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించినట్లు భద్రతాధికారి బుధవారం మీడియాకు వివరించారు. ఈ కెమెరాల ద్వారా ఫేస్​ రికగ్నైజేషన్​ చేపట్టనున్నారు. దీంతో ఉద్రిక్తతలకు తావిస్తున్న ప్రాంతాల్లో కొత్తవారు ఎవరన్నది ఇట్టే కనిపెట్టనున్నారు. వారిపై నిఘాను పెంచనున్నారు. అదే సమయంలో స్థానికులపై కూడా నిఘా పెట్టనున్నారు. దీంతో స్లీపర్​ సెల్స్​ ఆటకట్టించే యోచనలో భద్రతా బలగాలు ఒక అడుగు ముందుకేసిందనే చెప్పాలి. హైటెక్​ ఆధారిత సాంకేతితతో ఉగ్రవాదుల పనిపట్టనున్నారు.