2.5 లక్షల అదనపు వీసాలు

యూఎస్​ ఎంబసీ ప్రకటన

Sep 30, 2024 - 18:08
 0
2.5 లక్షల అదనపు వీసాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ​: అమెరికా వెళ్లే భారతీయులకు అదనంగా 2.5 లక్షల వీసాలను మంజూరు చేస్తున్నట్లు భారత్​ లోని యూఎస్​ ఎంబసీ ప్రకటించింది. సోమవారం ఎంబసీ ప్రకటనపై ఉన్నతస్థాయి విద్యనభ్యసించేందుకు అమెరికాకు వెళ్లాలని ఎదురు చూస్తున్న విద్యార్థుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ప్రతీయేటా భారతీయులకు అందించే వీసాలు పరిమిత సంఖ్యలో ఉండడం వల్ల తీవ్ర పోటీ నెలకుంటోంది. ప్రస్తుతం అమెరికా ప్రకటన తరువాత అమెరికా వెళ్లాలనుకున్న ఉద్యోగార్థులు, విద్యార్థుల కల నెలవేరనుంది. పర్యాటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులకు కూడా ఈ వీసాల పెంపుదలతో అవకాశాలు మరింత పెరగనున్నాయి. భారత్​–అమెరికా మధ్య బలమైన బంధాలకు భారీ ఎత్తున వీసాలు జారీ చేయడమే నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు.