నూతన ఏయిర్ చీఫ్ గా అమర్ ప్రీత్ సింగ్ బాధ్యతల స్వీకరణ
Amarpreet Singh assumed charge as the new Air Chief
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత వైమానిక దళానికి కొత్తచీఫ్ గా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ సోమవారం న్యూ ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. అమర్ ప్రీత్ సింగ్ 1984లో భారత వైమానిక దళంలో చేరారు. 40యేళ్లపాటు వివిధ విభాగాల్లో విశిష్ట సేవలందించారు. వీఆర్ చౌదరి స్థానంలో అమర్ ప్రీత్ సింగ్ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ చౌదరికి ఆయన వీడ్కోలు పలికారు. అమర్ ప్రీత్ సింగ్ తేజస్ లాంటి యుద్ధవిమానాలను నడపడంలో దిట్ట. ఈ బాధ్యతలు చేపట్టేముందు సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా ఉన్నారు.