జ్యోతిర్లింగాల దర్శనానికి భారీగా భక్తులు
Huge number of devotees visit Jyotirlinga
డెహ్రాడూన్: జ్యోతిర్లింగాల దర్శనంలో రికార్డులు నమోదయ్యాయి. ప్రముఖ పుణ్య క్షేత్రం కేదార్ నాథ్ ధామ్ ను ఒక నెలలోనే 7,66,188 లక్షల మంది దర్శించుకున్నట్లు మంగళవారం దేవాదాయ శాఖ స్పష్టం చేసింది. ఇది సరికొత్త రికార్డని పేర్కొంది. సగటున రోజుకు 25 వేల మంది భక్తులు పాల్గొనగా, మే 21న 38,682 మంది భక్తులు పాల్గొన్నట్లు వెల్లడించింది. మే 10న కేదార్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. అయితే గత నెల రోజులుగా వీఐపీ, వీవీఐపీ దర్శనాలను దేవాదాయ శాఖ రద్దు చేసింది. అయితే కేదార్ నాథ్ ధామ్ యాత్రలో గుర్రం, కార్మికులు కర్రలపై కూర్చోబెట్టి భక్తులను చేర్చడం ద్వారా సుమారు 70 కోట్ల వ్యాపారం జరిగినట్లు గుర్తించారు. అదే సమయంలో హెలికాప్టర్ ద్వారా వెళ్లిన భక్తుల వల్ల రూ. 45 కోట్ల వ్యాపారం జరిగినట్లు అధికారులు వివరించారు. ఇదేగాక దుకాణాలకు కూడా భారీ ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. గంగోత్రి–యమునోత్రి ధామ్ కు కూడా ఒక్క నెలలో 7.26 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.