ఇండిగో సర్వర్ డౌన్
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ప్యాసింజర్ సేవలు ఇబ్బందుల్లో ప్రయాణికులు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఇండిగో ఎయిర్ లైన్స్ సర్వర్ డౌన్ అయింది. దీంతో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ సేవలు నిలిచిపోయాయి. టిక్కెట్ల బుకింగ్ లు ఆగిపోయాయి. శనివారం దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో ఈ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించే ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. గ్రౌండ్ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పలు చోట్ల ప్రయాణికులు ఇండిగో సిబ్బంది, అధికారులతో అధికారులతో వాగ్వాదానికి దిగారు. సర్వర్ ఎప్పుడు సరికానుందనే విషయంపై స్పష్టత లేదు.