హిజ్బొల్లా ఇంటలిజెన్స్​ కార్యాలయం పేల్చివేత

250మంది మృతి, ఐడీఎఫ్​ ప్రకటన

Oct 5, 2024 - 15:38
 0
హిజ్బొల్లా ఇంటలిజెన్స్​ కార్యాలయం పేల్చివేత

బీరూట్​: ఇరాన్​ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్​ లెబనాన్​ లోని హిజ్బొల్లా స్థావరాలపై విరుచుకుపడుతోంది. శనివారం తెల్లవారు జామున బీరూట్​ లోని హిజ్బొల్లాకు చెందిన ఇంటలిజెన్స్​ ప్రధాన కార్యాలయాన్ని పేల్చేసింది. ఈ దాడిలో 250మంది మృతి చెందారని ఐడీఎఫ్​ ప్రకటించింది. దాడిపై ఇరాన్​ గుర్రుగా ఉంది. ఇజ్రాయెల్​ వరుస దాడులతో శనివారం వరకు 1.2 మిలియన్ల లెబనాన్​ ప్రజలు ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. దాడికి ముందు ఐడీఎఫ్​ హెచ్చరికలు జారీ చేసింది. దాడి అనంతరం లెబనాన్​ లోని ఒడైసేలో ఐడీఎప్​ దళాలు ప్రవేశించాయి.