కాంగ్రెస్, ఆప్ లవ్, అరెంజ్ మ్యారేజ్ కాదు
శాశ్వత పొత్తేం లేదు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కాంగ్రెస్, ఆప్ లది లవ్, అరెంజ్ మ్యారేజ్ కాదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పొత్తు శాశ్వతం కాదన్నారు. జూన్ 4న తరువాత ఎవరి దారి వారిదే అన్నారు. ఢిల్లీలో రెండు పార్టీలూ కలిసి పోటీ చేసినా తమది శాశ్వత బంధం కాదన్నారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పంజాబ్ లో బలంగా ఉన్నాం కాబట్టే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోలేదన్నారు. జూన్ 4న ఫలితాల తరువాత పార్టీ కార్యాచరణను నిర్ణయిస్తామని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తన అరెస్టు చట్టవిరుద్ధమన్నారు. అరెస్టుపై న్యాయపోరాటం చేస్తానన్నారు. తాను సచ్ఛీలుడినని సీఎం పేర్కొన్నారు.