ప్రియాంక నామినేషన్ దాఖలు
Priyanka's nomination filed
వయోనాడ్: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా వయోనాడ్ ఎంపి స్థానంలో పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఆమె భారీ ర్యాలీ నిర్వహించారు. ఆమె వెంట సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే రాష్ర్ట కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీ ద్వారా కదలి వచ్చారు. నామినేషన్ కు ముందు ప్రియాంక గాంధీ మాట్లాడతూ.. తాను 17 యేళ్ల వయసులోనే రాజీవ్ గాంధీ (తండ్రి) ఎన్నికల ప్రచార సభలో ప్రచారం చేశానన అన్నారు. అప్పటి నుంచి గత 35 యేళ్లుగా ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడుతున్నానని తెలిపారు. వయోనాడ్, రాయ్ బరేలీ నుంచి ఎంపి స్థానాల్లో పోటీ చేసిన రాహుల్ గాంధీ గెలుపొందారు. అనంతరం వయోనాడ్ స్థానాన్ని వదులుకొని తన సోదరిని పోటీకి దింపారు. ఈ స్థానం నుంచి బీజేపీ మహిళా అభ్యర్థి నవ్య హరిదాస్ ద్వారా ప్రియాంకల మధ్య పోటీ హోరాహోరీగా ఉండనుందనే వాదనలున్నాయి.