భారత్ మోదీ, అమెరికా ట్రంప్ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు
ప్రముఖ గాయనీ మేరీ మిల్బెన్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (భారత్–అమెరికా) ప్రజాస్వామ్య పునాదులకు మరింత బలం చేకూర్చనున్నారని ప్రపంచ ప్రఖ్యాత గాయకురాలు మేరీ మిల్బెన్ అన్నారు. సామాజిక మాధ్యమం వేదికగా డొనాల్డ్ ట్రంప్ విజయంపై అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ల నేతృత్వంలో ఇరుదేశాల బంధాలు మరింత బలోపేతం కాగలవన్నారు. మేరీ మిల్బెన్ ప్రధాని నరేంద్ర మోదీ విధానాలపై ఆకర్షితులయ్యారు. ఆయన వైశ్విక కుటుంబం వంటి మాటలతో ప్రేరణ పొందినట్లు పలుమార్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కార్యక్రమాలు, విధానాలపై మిల్బెన్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తుంటారు.