బ్రిక్స్​ లో టర్కీ సభ్యత్వం భారత్​ ఒప్పుకోలే!

జర్మన్​ పత్రిక కథనంపై మండిపడ్డ టర్కీ మాజీ దౌత్యవేత్త అల్జెన్​

Oct 25, 2024 - 18:52
 0
బ్రిక్స్​ లో టర్కీ సభ్యత్వం భారత్​ ఒప్పుకోలే!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బ్రిక్స్​ దేశాల్లో పాక్​ తోపాటు టర్కీని సభ్యదేశంగా గుర్తించేందుకు భారత్​ ఒప్పుకోలేదని జర్మన్​ వార్తా పత్రిక కథనం రాయడంపై టర్కీ విదేశాంగ మాజీ దౌత్యవేత్త సినాన్ అల్జెన్ ఈ వార్తలను ఖండించారు. శుక్రవారం ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. టర్కీ సభ్యత్వ దేశంగా చేరడంపై అసలు చర్చే కొనసాగలేదన్నారు. బ్రిక్స్​ దేశాల విస్తరణపై అసలు చర్చే జరగలేదన్నారు. యూరప్​ దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయనడం అవాస్తవమన్నారు. పాక్​ తో అత్యంత దగ్గర దోస్తీ నిర్వహిస్తున్న టర్కీ అధ్యక్షుడు తయ్యిప్​ ఎర్డోగాన్​ హాజరు కావడంపై కూడా అనేక దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశారని ఆ పత్రిక కథనాల్లో రాసింది. 

బ్రిక్స్​ లో నూతన సభ్యత్వ దేశాలుగా ఈజిప్ట్​, ఇథియోపియా, ఇరాన్​, యూఎఈలు నమోదయ్యాయి. సభ్యత్వ దేశాలుగా నమోదైనా బ్రిక్స్​ వేదికపై కొంతకాలంపాటు నిర్ణయాలు తీసుకునే అధికారం మాత్రం తొలుత నుంచి తీసుకున్న దేశాలకే ఉండనుంది.