మణిపూర్ హింసకాండ 12 మంది అరెస్ట్
నలుగురికి ఉగ్ర గ్రూపులతో సంబంధం
ఇంఫాల్: మణిపూర్ హింసాకాండలో పోలీస్ స్టేషన్, ఎమ్మెల్యే నివాసాలకు నిప్పంటించిన 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరే గాక నలుగురు ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్న వారినిక కూడా అరెస్టు చేసినట్లుతెలిపారు. శనివారం వీరికి అదుపులోకి తీసుకున్నట్లు ఇంఫాల్ వెస్ట్ పట్సోయ్ పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నలుగురి వద్ద ఆయుధాలు లభించాయన్నారు. వీరు దోపిడీలకు కూడా పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. కంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ, యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ కి చెందిన ఉగ్రవాదులన్నారు. ఈ రెండు ఉగ్ర గ్రూపులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందన్నారు.