నిరుపేద కుటుంబానికి ఆర్థిక చేయూత 

Financial assistance to poor family

Oct 25, 2024 - 18:58
 0
నిరుపేద కుటుంబానికి ఆర్థిక చేయూత 

నా తెలంగాణ, రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయంతో చేయూతను అందించింది. పట్టణంలోని కనకదుర్గ కాలనీకి చెందిన బర్ల హర్షవర్ధన్ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉండగా అందులో ఒక్కరు మానసికంగా వికలాంగుడైన కొడుకు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కాయం తిరుపతి ఆధ్వర్యంలో రూ.18 వేలను హర్షవర్ధన్ కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు సట్ల మహేందర్, కోశాధికారి తూముల సురేష్, ఉపాధ్యక్షుడు బొద్దుల సతీష్, బీనవేన సంపత్, కనుకుంట్ల సుభాష్, జెట్టి శ్రీనివాస్, బొక్కల తిరుపతి మొదలైన వారు పాల్గొన్నారు.