భారత వ్యోమగాములకు నాసా శిక్షణ

అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి  అంతరిక్ష రంగంలో నాసా–ఇస్రో ఉమ్మడి భాగస్వామ్యం 2028 వరకు 'ఇండియన్ ఇంటర్నేషనల్ స్టేషన్'ని ఏర్పాటు సోమనాథ్​

May 25, 2024 - 17:56
 0
భారత వ్యోమగాములకు నాసా శిక్షణ

బెంగళూరు: భారతీయ వ్యోమగాములకు త్వరలోనే నాసా ఆధునాతన శిక్షణ ఇవ్వనున్నట్లు అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. శనివారం బెంగుళూరులో యూఎస్​–ఇండియా కమర్షియల్​ స్పేస్​ కాన్ఫరెన్స్​ లో పాల్గొన్నారు. భారత్​–అమెరికా అంతరిక్షరంగంలో సంయుక్తంగా కలిసి పనిచేయాలని నిర్ణయించాయని తెలిపారు. 

నాసా–ఇస్రోలు సంయుక్తంగా ఉపగ్రహ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయన్నారు. ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం పర్యావరణం, భూ ఉపరితలం, ప్రమాదాలు, సముద్ర మట్టాల పెరుగుదల, సహజ వనరుల లభ్యత, సమాచారం కోసం త్వరలోనే ఇస్రో నిసార్​ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహం నాసా, ఇస్రో ఉమ్మడి భాగస్వామ్యంతో రూపొందుతోంది.

భారత్​ – అమెరికా అంతరిక్ష రంగంలో సంయుక్తంగా కలిసి పనిచేయడంపై ఇస్రో చైర్మన్​ ఎస్​. సోమనాథ్​ సంతోషం వ్యక్తం చేశారు. 2028 నాటికి మొదటి 'ఇండియన్ ఇంటర్నేషనల్ స్టేషన్'ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సోమనాథ్​ తెలిపారు. ప్రయోగాలకు వీలుగా ప్రయోగశాలను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సోమనాథ్​ స్పష్టం చేశారు. దీని ద్వారా ఆర్థికంగానూ ఇస్రో బలోపేతం కాగలదని సోమనాథ్​ ఆశాభావం వ్యక్తం చేశారు.