భారత్ సూపర్ పవర్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
మాస్కో: భారత్ సూపర్ పవర్, గొప్పదేశమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్ తో వివిధ రంగాలలో బంధాలను పంచుకుంటున్నామని పుతిన్ స్పష్టం చేశారు. గొప్ప ఆర్థిక వ్యవస్థలలో భారత్ ప్రధానమైందన్నారు. 7.4 జీడీపీతో భారత్ దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. భారత్ ప్రపంచదేశాల్లో అగ్రరాజ్య జాబితాలో చేర్చాలని పుతిన్ డిమాండ్ చేశారు. భారతదేశ స్వాతంత్ర్యంలో రష్యా పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఒకటిన్నర బిలియన్ల జనాభా కలిగిన అతిపెద్ద దేశం భారత అన్నారు. ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు భవిష్యత్తులో అత్యంత ప్రాధాన్యతకు సూచికలుగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. భారత్–రష్యాలు సంయుక్తంగా కలిసి బ్రహ్మోస్ ను అభివృద్ధి చేశాయని తెలిపారు.