బీజేపీలో చేరిన అశోక్ చౌహాన్
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహారాష్ట్రలో సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు.
ముంబయి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహారాష్ట్రలో సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. హస్తం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ బీజేపీలో చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికలకు బుధవారం నామినేషన్ వేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నా జీవితంలో కొత్త రాజకీయ ప్రయాణానికి నాంది. బీజేపీలో చేరడం నా స్వతంత్ర నిర్ణయం’’ అని అన్నారు. చవాన్ 2014 నుంచి -2019 మధ్య రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలేతో ఉన్న విభేదాలే ఆయన రాజీనామాకు దారితీసి ఉండొచ్చని వార్తలు వచ్చాయి.