భారత్–జపాన్ మరింత పురోగతి
ప్రధాని మోదీతో పీఎం కిషాదా భేటీ బీ2బీ, పీ2పీ సహకారం మరింత బలోపేతం
వాషింగ్టన్: భారత్–జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచభాగస్వామ్యం మరింత పురోగతిని సాధించాలని ప్రాని మోదీ ఆకాంక్షించారు. ఆదివారం అమెరికాలోని డెలావేర్ విల్మింగ్టన్ లో క్వాడ్ సమ్మిట్ సందర్భంగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో ప్రధాని మోదీ సమావేశమై పలు విషయాలపై చర్చలు జరిపారు. జపాన్ తో సంబంధాలలో మరింత పురోగతి సాధించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఇరుదేశాల మధ్య రక్షణ, భద్రత, బీ2బీ (బిజినెస్ టు బిజినెస్), పీ2పీ (పేమెంట్ టు పేమెంట్) సహకారం మరింత బలోపేతంపై చర్చించారు.
ఈ నేపథ్యంలో ఇరువురు ప్రధానుల్లో చారిత్రక, భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చర్చల ముగింపులో జపాన్ ప్రధాని కిషిదా ప్రధాని నరేంద్ర మోదీ (భారత్)తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. ఇరుదేశాల బంధాలు మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.