మణిపూర్​ లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

20 సీఆర్పీఎఫ్​ అదనపు బృందాలు

Nov 13, 2024 - 14:44
 0
మణిపూర్​ లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

ఇంఫాల్​: మణిపూర్​ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సోమవారం కుకీ ఉగ్రవాదుల ఎన్​ కౌంటర్​ తరువాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కుకీ వర్గం వారుపెద్ద యెత్తున ఆందోళనలకు, విధ్వంసాలకు దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉండడంతో కేంద్రం వెంటనే 20 కంపెనీల సీఆర్పీఎఫ్​ అదనపు బలగాలను బుధవారం ఉదయం రంగంలోకి దింపింది. మంగళవారం రాత్రే ఉత్తర్వులు జారీ చేసినా రోడ్డు మార్గాల ఆలస్యం కానుండడంతో బలగాలను రక్షణ బృందాల హెలికాప్టర్ల ద్వారా నేరుగా మణిపూర్​ కు పంపింది. 20 బృందాలకు సంబంధించి రెండువేల మంది సైనికులున్నారు. వీరిని ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతాల్లో మోహరించనున్నారు. సోమవారం ఎన్ కౌంటర్​ లో కుకీ ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలను కూడా భద్రతా బలగాలు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై కేంద్ర నిఘా వర్గాలు ఆరాతీసేందుకు రంగంలోకి దిగాయి. నవంబర్​ 30 వరకు అదనపు బలగాలు ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతాల్లోనే ఉండనున్నాయి.