భారత్​–చైనా ఒప్పందం వాస్తవమే!

చైనా ప్రతినిధి లిన్​ జియాన్​

Oct 22, 2024 - 16:41
 0
భారత్​–చైనా ఒప్పందం వాస్తవమే!

మాస్కో: భారత్​–చైనా సరిహద్దు వివాదంపై  ఇరుదేశాల మధ్య ఒప్పందం విషయం వాస్తవమేనని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్​ జియాన్​ పేర్కొన్నారు. మంగళవారం జియాన్​ మీడియాతో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య దౌత్య, సైనిక మార్గాల ద్వారా సమస్యల పరిష్కారానికి ఒప్పందం కుదిరిందన్నారు. మరోవైపు ఎల్​ వోసీ వద్ద ఇరుదేశాల సైన్యం పెట్రోలింగ్​ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇరుదేశాల్లో సరిహద్దు, పలు సమస్యల శాంతియుత పరిష్​కారానికి విదేశాంగ కార్యదర్శి విక్రమ్​ మిస్ర్తీ తీవ్రంగా ప్రయత్నించారు. ఉద్రిక్తతలను సమసివేసేందుకు మోదీ నేతృత్వంలో ఆయన చేసి కృషి ఫలించి ఎట్టకేలకు ఒప్పందం ఖరారైంది.  ఇరుదేశాల మధ్య సంబంధాలను స్థిరీకరించడంలో కీలకపాత్ర పోషించనున్నట్లు ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంతో ఇరుదేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ప్రతిష్ఠంభన కొంతకాలంపాటు సద్దుమణగనుంది. అనంతరం జరిగే కీలక దశ చర్చల ద్వారా సరిహద్దు వివాదాన్ని పూర్తిగా సమసేలా చేయాలని భారత్​ భావిస్తుంది.