సిద్ధాంతానికి ఉద్దవ్​ వ్యతిరేకం

అందుకే బయటికొచ్చాం: సీఎం ఏక్​ నాథ్​ షిండే

Nov 2, 2024 - 14:07
 0
సిద్ధాంతానికి ఉద్దవ్​ వ్యతిరేకం

ముంబాయి: సిద్ధాంతానికి వ్యతిరేకంగా వెళ్లినందుకే ఉద్దవ్​ ఠాక్రేను వీడాల్సి వచ్చిందని మహారాష్​ర్ట సీఎం ఏక్​ నాథ్​ షిండే అన్నారు. థాకరే అత్యాశ కూడా పార్టీ విచ్ఛిన్నానికి దారితీసిందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఠాక్రే వ్యక్తిగత, అనుబంధాల ఉచ్చులో చిక్కుకోవడంతోన పార్టీని పడగొట్టాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. సీఎం కావాలనే కోరనికతో ఆయన ఎవ్వరి మాట వినలేదరన్నారు. బాలాసాహెబ్​ పోరాడిన కాంగ్రెస్​ లోకే చివరకు వెళ్లారన్నారు. శివసేన (ఉద్ధవ్​) పతనం అంచున ఉందన్నారు. కాంగ్రెస్​ ను దూరం పెట్టాని ఎన్నోసార్లు ఉద్దవ్​ ఠాక్రేకు వివరించానని తెలిపారు. కానీ ఆయన ఏనాడూ పట్టించుకోలేదన్నారు. చూస్తూ చూస్తూ శివసేన పార్టీ నష్టాలను చవిచూడడం ప్రారంభించిందన్నారు. దీన్ని చూడలేక మహారాష్ర్ట ప్రజల గొంతుకను నిలబెట్టాలనే ఆలోచనతోనే ఉద్దవ్​ ను వీడి బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ప్రజలు కూడా ఇదే సంకీర్ణం మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.