విస్తారాలో సిబ్బంది కొరత 70 విమానాల రద్దు?
ప్రముఖ టాటా గ్రూప్ విస్తారా ఎయిర్లైన్స్ 70 విమానాలు రద్దు అయ్యే అవకాశాలున్నట్లుగా ఏవియేషన్ అధికారులు, టాటా గ్రూప్ అధికారులు తెలిపారు.
నా తెలంగాణ, న్యూఢిల్లీ: ప్రముఖ టాటా గ్రూప్ విస్తారా ఎయిర్లైన్స్ 70 విమానాలు రద్దు అయ్యే అవకాశాలున్నట్లుగా ఏవియేషన్ అధికారులు, టాటా గ్రూప్ అధికారులు తెలిపారు. రద్దుకు ప్రధానంగా సిబ్బంది కొరతే కారణమని పేర్కొంటున్నారు. గత వారంలో కూడా 100 విమానాల్లో కొన్ని ఆలస్యంగానూ మరికొన్ని రద్దైనట్లు వివరించారు. కాగా ప్రయాణికుల ఇబ్బంది దృష్ట్యా విమానయాన మంత్రిత్వ శాఖ విస్తారా నుంచి వివరణ కోరింది. ఇప్పటికే రద్దు అయిన వాటిలో న్యూఢిల్లీ ఐదు, బెంగళూరు మూడు, కోల్‌కతాకు రెండు విమానాలు రద్దు చేసినట్లు పేర్కొంది. మంత్రిత్వ శాఖకు సమాధానం ఇస్తూ పైలట్ల కొరత, నిర్వహణ సమస్యల కారణంగా ఈ విమానాలను రద్దు చేస్తున్నట్లు వివరించింది. అదే సమయంలో ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంది.