వక్ఫ్ బిల్లు జేపీసీ సమావేశం రసాభాస
చైర్మన్ పై బాటిల్ విసిరేందుకు టీఎంసీ ఎంపీ ప్రయత్నం కళ్యాణ్ బెనర్జీ చేతికి గాయం
![వక్ఫ్ బిల్లు జేపీసీ సమావేశం రసాభాస](https://naatelanganadaily.com/uploads/images/202410/image_870x_67177c2474e82.jpg)
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వక్ఫ్ బిల్లుపై జేపీసీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం న్యూ ఢిల్లీలో పార్లమెంట్ అనెక్స్ లో జేపీసీ సమావేశమైంది. కొద్దిసేపు బీజేపీ, టీఎంసీ సభ్యుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో రెచ్చిపోయిన టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ టేబుల్ పై ఉన్న గ్లాస్ వాటర్ బాటిల్ ను ఆగ్రహంతో గట్టిగా కొట్టాడు. దీంతో అతని చేతికి గాయమైంది. అనంతరం ఇదే బాటిల్ ను చైర్మన్ జగదాంబిక పాల్ వైపు విసిరేందుకు ప్రయత్నించాడు.దీంతో మరింత వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ, కళ్యాణ్ బెనర్జీ మధ్య వాగ్వాదంతో కళ్యాణ్ బెనర్జీకి కోపమొచ్చింది. సమావేశం నుంచి కళ్యాణ్ బెనర్జీని తొలగించాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. కాగా గాయం పెద్దది కావడంతో ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వేలికి నాలుగు కుట్లు వేశారు.