ఉగ్ర ఘటనలపై సైన్యం అప్రమత్తం
కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడులపై సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. శనివారం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారని ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. నలుగురు సైనికులు గాయాపడ్డారని మంత్రి తెలిపారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఈ ఘటనలు త్వరలోనే ముగుస్తాయని అన్నారు. ఇంతకుముందు ఉగ్రవాద దాడులు, ఈ ప్రాంతంలో అల్లకల్లోలం గురించి మీకు తెలియందని కాదన్నారు. ప్రస్తుతం రాష్ర్టం ప్రగతి పథంలో నడవాలని కోరుకుంటుందని క్రమేణా ఇలాంటి ఘటనలను ప్రజలే ఉపేక్షించడం లేదన్నారు. ఏది ఏమైనా ఉగ్ర ఘటనలు జరగడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.