అధికారుల విడుదల ఎప్పుడేం జరిగింది?

ఖతార్​ లో మరణశిక్ష పడ్డ ఎనిమిది మంది భారతీయుల విడుదల వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశేష కృషి ఉన్నట్లు ఇప్పటికే విదేశాంగ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.

Feb 14, 2024 - 15:37
 0
అధికారుల విడుదల ఎప్పుడేం జరిగింది?

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఖతార్​ లో మరణశిక్ష పడ్డ ఎనిమిది మంది భారతీయుల విడుదల వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశేష కృషి ఉన్నట్లు ఇప్పటికే విదేశాంగ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శిక్ష పడినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఏయే పరిణామాలు జరిగాయో చూద్దాం. ఆయా పరిణామాల మధ్యలో ఖతర్​ రాజుతో ప్రధాని మోదీ స్వయంగా భేటీ అయ్యారు. దీంతో భారతీయ మాజీ నేవీ అధికారుల విడుదలకు మార్గం సుగమమైంది. 
ఆగస్ట్​ 2022: ఖతర్​ లో అల్​ దహరా సంస్థలో పనిచేసేందుకు వెళ్లిన ఎనిమిది మంది మాజీ భారతీయ నేవీ అధికారుల అరెస్టు.
సెప్టెంబర్​ 2022: ఖతర్​ కోర్టులో బెయిల్​ పిటిషన్​ రద్దు.
అక్టోబర్​ 2022: మొదటిసారిగా భారత విదేశాంగ అధికారులకు న్యాయ సహాయం చేసేందుకు ఖతర్​ అనుమతించింది. 
నవంబర్​ 2022: ఖతర్​ లో ఉన్న భారత రాయబారి దీపికా మిత్తల్​ ను తప్పించి పీఎంవో కార్యాలయంలో ప్రత్యేకాధికారిగా నియమించారు.
డిసెంబర్​ 2022: అరెస్టైన వారి విడుదల కోసం ప్రయత్నిస్తున్నామని, అంశాలను బయటపెట్టలేమని స్పష్టం చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్​.
మార్చి 2023: అరెస్టైన ఏడు నెలలకు కేసుపై ఖతార్​ కోర్టులో వాదనలు జరిగాయి.
జూన్​ 2023: రెండోసారి విచారణ జరిగింది.
ఆగస్ట్​ 2023: అధికారులను అరెస్టు చేసి ఒక ఏడాది పూర్తి అయ్యింది.
అక్టోబర్​ 2023: ఖతార్​ లో నూతనంగా నియమితులైన భారత రాయబారి విపుల్​ జైలులో అధికారులను కలిశారు.
అక్టోబర్​ 2023: జైలు శిక్ష పడిన అధికారుల కుటుంబ సభ్యులతో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ భేటీ.
2023 అక్టోబర్​ 26: ఖతార్​ కోర్టు భారతీయులకు ఉరిశిక్ష విధించింది.
2023 డిసెంబర్​ 3:  శిక్షకు గురైన అధికారులతో భారత రాయబారి కలిశారు.
2023 డిసెంబర్​ 28: మరణశిక్ష జీవిత ఖైదుగా మార్పు.
2024 ఫిబ్రవరి 12: అధికారులు విడుదలై ఢిల్లీకి చేరుకొని సంతోషం వ్యక్తం చేశారు.