విద్యార్థి అత్యాచారం, హత్య మాజీ ప్రిన్సిపాల్​ హస్తంపై బలపడుతున్న అనుమానాలు

కూపీ లాగుతున్న సీబీఐ అవినీతి ఆరోపణలు, రాజకీయ పలుకుబడితో ఏళ్ల తరబడి కాలేజీలోనే తిష్ఠ

Aug 17, 2024 - 14:30
 0
విద్యార్థి అత్యాచారం, హత్య మాజీ ప్రిన్సిపాల్​ హస్తంపై బలపడుతున్న అనుమానాలు

కోల్​ కతా: కోల్​ కతా వైద్య విద్యార్థిని హత్య కేసు తవ్వేకొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో విద్యార్థులు ఆరోపిస్తున్నట్లు పెద్దల హస్తం ఉందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. మర్డర్​ జరిగిన వెంటనే హత్యను నిర్ధరిస్తూ విద్యార్థుల ఆందోళన తరువాత ఆర్జీకర్​ ప్రిన్సిపాల్​ రాజీనామా విషయాలపై  సీబీఐ కూపీ లాగింది. విద్యార్థినిది రేప్​ అండ్​ మర్డర్​ జరిగిందని మీరెలా నిర్ధరించారని ప్రిన్సిపాల్​ సందీప్​ ఘోష్​ ను ప్రశ్నించారు. రాజీనామా చేయగానే మరో కాలేజీలో ప్రిన్సిపాల్​ గా ఉత్తర్వులు ఎలా పొందారని దీని వెనుక ఎవరున్నారని, అసలు ఆ రోజు ఆసుపత్రిలో ఎంతమంది ఉన్నారని ఆరా తీసింది. 30 మంది వరకు అనుమానితులను సీబీఐ విచారిస్తోంది. విద్యార్థిని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన ప్రతీ ఒక్కరిని సీబీఐ విచారిస్తోంది. మరోవైపు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన వారిని కూడా మరో బృందం విచారిస్తోంది. 

మరోవైపు ప్రిన్సిపాల్​ సందీప్​ ఘోష్​ పై సీబీఐ కూపీ లాగింది. ఇతనిపై గతంలోనే పలు అవినీతి ఆరోపణలున్నట్లుగా గుర్తించింది. 2023 మే 31న సందీప్​ ఘోష్​ స్థానంలో మమత బెనర్జీ సర్కార్​ డా. సనత్​ ఘోష్​ ను ఆర్జీకర్ మెడికల్​ కాలేజీకి ప్రిన్సిపాల్​ గా నియమించింది. 24 గంటల్లోనే తిరిగి సనత్​ ను వెనక్కు పంపి సందీప్​ ఘోష్​ ను నియమించినట్లు సీబీఐ గుర్తించింది. ఇలా ఎందుకు జరిగిందనే విషయంపై ఆరా తీస్తోంది. 2023 సెప్టెంబర్​ 11 ముర్షీదాబాద్​ కు ట్రాన్స్​ ఫర్​ అయ్యారు. అనూహ్యాంగా కేవలం 25 రోజుల్లోనే 2023 అక్టోబర్​ 9నే తిరిగి ఇదే కాలేజీకి ప్రభుత్వం ప్రిన్సిపాల్​ గా నియమించింది. ఈయనపై వచ్చిన పలు ఆరోపణలపై రాష్​ర్ట ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి తరువాత కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. అంతేకాదు మెడికల్​ విద్యార్థులు కూడా ప్రిన్సిపాల్​ పై అనేక ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పలువురు వైద్యులు కూడా ఫిర్యాదు చేస్తే వారికి బెదిరింపులు, ట్రాన్స్​ ఫర్లు తప్పలేదని సీబీఐ గుర్తించింది. అయితే మమత సర్కార్​ కు ప్రిన్సిపాల్​ సందీప్​ ఘోష్​ కు మధ్య ఉన్న కనెక్షన్​ ఏంటనే విషయంపై సీబీఐ ఆరా తీస్తోంది.