అమిత్​ షాపై ఆరోపణలు కెనడాకు నోటీసులు

జారీ చేసిన భారత విదేశాంగ శాఖ

Nov 2, 2024 - 16:52
 0
అమిత్​ షాపై ఆరోపణలు కెనడాకు నోటీసులు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షాపై కెనడా ఆరోపణలపై భారత్​ సీరియస్​ గా స్పందించింది. కెనడా హై కమిషన్​ ప్రతినిధికి శనివారం భారత్​ సమన్లు జారీ చేసింది. అసంబద్ధమైన, నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తున్నట్లు ఎంఇఎ అధికార ప్రతినిధి రణధీర్​ జైస్వాల్​ పేర్కొన్నారు. తామ కెనడా హై కమిషన్​ ప్రతినిధిని పిలిపించామన్నారు. నోటీసులు జారీ చేశామన్నారు.  మంత్రి డేవిడ్​ మారిసన్​ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్​ ను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నమేనని మండిపడింది. వ్యూహం ప్రకారం ఉద్దేశ్యపూర్వకంగా భారత్​ ను కెనడా ప్రభుత్వం నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వాటిని లీక్​ చేస్తూ ప్రచారం నిర్వహిస్తూ అసత్యాలను వాస్తవాలుగా ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. కెనడా చర్యలు ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాల్లో విఘాతం కలిగిస్తాయని రణధీర్​ హెచ్చరించారు. ఖలిస్థానీ హత్యల కుట్ర కోణంలో కేంద్రమంత్రి అమిత్​ షా హస్తం కూడా ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ కెనడాకు నోటీసులు జారీ చేసి చురకలంటించింది.