కోడాకు సుప్రీం ఝలక్
శిక్ష రద్దుకు నో బొగ్గు కుంభకోణంలో మూడేళ్ల జైలు శిక్ష పిటిషన్ విచారణ
రాంచీ: ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. బొగ్గు కుంభకోణంలో అక్రమాలపై దోషిగా తేలినందున శిక్షను రద్దు చేయాలన్న, తగ్గించాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. శుక్రవారం ఈ కేసుపై సుప్రీం ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతో మధు కోడా ఎన్నికలలో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయినట్లయ్యింది. గతంలో ఢిల్లీ హై కోర్టు కూడా ఈ పిటిషన్ ను కొట్టివేసింది. 2017లో అవినీతి నిరోధక చట్టం కింద నేరం ఋజువు కావడంతో ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధించారు. 2018లో ఆయనకు బెయిల్ లభించింది. 2020లో నేరారోపణలపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. శిక్ష తగ్గించాలని, రద్దు చేయాలన్న పిటిషన్ ను తోసిపుచ్చింది. ఇదే పిటిషన్ పై మధు కోడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు అంతిమంగా సుప్రీంకోర్టు ఆయన శిక్షను రద్దు చేసేందుకు నిరాకరించింది.