హజ్​ యాత్రలో పెరిగిన మృతుల సంఖ్య

  ఎండలకు తాళలేక 922 మంది మృతి

Jun 20, 2024 - 14:52
 0
హజ్​ యాత్రలో పెరిగిన మృతుల సంఖ్య

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సౌదీ అరేబియా మక్కా హజ్​ యాత్రకు వెళ్లిన వారిలో మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం వరకు 922 మృతిచెందినట్లుగా గురువారం మీడియా ప్రకటించింది. మృతిచెందిన వారిలో 600మంది ఈజిప్టుకు చెందిన వారుండగా, జోర్డాన్​ కు చెందిన వారు 300పైనే ఉన్నట్లుగా స్పష్టం చేశారు. కాగా మృతుల గుర్తింపు ప్రక్రియ అధికారులకు సవాల్​ గా మారుతోంది. మరోవైపు 1400మంది జాడ తెలియనట్లుగా మీడియా పేర్కొంది. 

ఎండలు మండిపోతుండడంతో హజ్​ యాత్రకు విచ్చేసిన వృద్ధులు, నడివయస్కులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ యేడాది భారత్​ నుంచి 1,75,000 లక్షలమంది హజ్​ యాత్రకు వెళ్లారు. మరోవైపు ఎండల తాకిడిని తట్టుకోలేక సుమారు 3వేల మందికి పైగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.