ఇరాన్​ అధ్యక్ష రేసులో అహ్మదీ నెజాదీ

అమెరికా, ఇజ్రాయెల్​ లకు బద్ధ శత్రువుగా పేరు

Jun 2, 2024 - 16:02
 0
ఇరాన్​ అధ్యక్ష రేసులో అహ్మదీ నెజాదీ

టెహ్రాన్​: ఇరాన్​ అధ్యక్ష ఎన్నికల్లో రాడికల్​ నాయకుడు అహ్మదీ నెజాదీ​ ఆదివారం తన నామినేషన్​ ను దాఖలు చేశారు. మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తరువాత ఆ దేశానికి అధ్యక్ష ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే మరో 20 మంది కూడా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్నారు. పై వరుసలో అహ్మదీ నెజాదీనే చెప్పుకోవచ్చు. గతంలో రెండుసార్లు ఆయన అధ్యక్ష పదవిని చేపట్టాడు. 2021లో సుప్రీంకోర్టు నెజాదీ అధ్యక్ష పదవిలో పోటీ చేయొద్దనే ఆదేశాలతో ఆయన తప్పుకున్నాడు. తాజాగా నెజాదీ నామినేషన్​ తో ఇరాన్​ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అనుకున్నట్లుగానే నెజాదీ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే అమెరికా, ఇజ్రాయెల్​ కు కష్టాలు పెరగనున్నాయనే చెప్పాలి. ఈ రెండు దేశాలకు నెజాదీ బద్ధ వ్యతిరేక అనే ముద్ర కూడా పడింది. ఇజ్రాయెల్​ ను ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తానని పలుమార్లు హెచ్చరించడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఇతన్ని అధ్యక్ష రేసు నుంచి 2021లో తప్పించిందనే వాదనలు కూడా లేకపోలేదు. దూకుడుగా వ్యవహరించే నేతగా ప్రపంచంలో అహ్మదీ నెజాదీకి పేరుండడం గమనార్హం.