బీజాపూర్ లో ఎన్ కౌంటర్ ఇద్దరు నక్సల్స్ మృతి
Two Naxals killed in encounter in Bijapur
బీజాపూర్: బీజాపూర్ లో భద్రతా బలగాలు, నక్సలైట్లకు జరిగిన కాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ కాల్పులు బాసగూడ, ఉసూర్, పమేడ్ ప్రాంతాల్లో జరిగాయి. ఈ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలపై నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. సంఘటనా స్థలం నుంచి ఒక ఎస్ ఎల్ ఆర్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. బీజాపూర్ లో ఎస్టీఎఫ్, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ ల ఉమ్మడి ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కాగా కాల్పుల్లో మృతిచెందిన నక్సలైట్లు ఎవరనేది గుర్తించే పనిలో భద్రతాధికారులు నిమగ్నమయ్యారు.