ఒడిశా అసెంబ్లీ స్పీకర్ గా సురామ పాధి

Surama Padhi as Speaker of Odisha Assembly

Jun 20, 2024 - 15:51
 0
ఒడిశా అసెంబ్లీ స్పీకర్ గా సురామ పాధి

భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ స్పీకర్ గా బీజేపీ సీనియర్ నేత సురామ పాధి ఎన్నికయ్యారు. ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రొటెం స్పీకర్ ఆర్పీ స్వెన్ గురువారం ప్రకటించారు. ఒడిశా అసెంబ్లీ స్పీకర్ గా ప్రమీలా మల్లిక్ తర్వాత ఈమె ఆ పదవికి ఎన్నికైన రెండో మహిళా స్పీకర్ గా రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఉపముఖ్యమంత్రులు కెవి. సింగ్ డియో, ప్రవతి పరిదా, ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్, ఇతర సభ్యులు ఈ సందర్భంగా సురామ పాధికి శుభాకాంక్షలు తెలిపారు. సురామ పాధి తనకు అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభా గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేస్తానన్నారు. ఆమె నయాగఢ్ జిల్లాలోని రాన్ పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజెడి-బీజేపీ కూటమి ప్రభుత్వంలో సహకార మంత్రిగా కూడా పనిచేశారు.