ఉగ్ర ఘటనల నిరోధానికి రక్షణ శాఖ సమావేశం
Defense Department meeting to prevent terrorist incidents
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో ఉగ్ర ఘటనలను నిరోధించేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో న్య ఢిల్లీ సౌత్ బ్లాక్ లో బుధవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా తుదముట్టించే ప్రణాళికలపై చర్చించారు. ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు ఉన్న మార్గాలపై చర్చించారు. జమ్మూకశ్మీర్ లో మరికొద్ది కాలంపాటు భద్రతా దళాలు హై అలర్ట్ లో ఉంచాలని సమావేశంలో నిర్ణయించారు.
కొండ, అటవీ, సొరంగ మార్గాలలో నక్కి ఉగ్రవాదులు ఆకస్మిక దాడులు జరపడంపై కూడా చర్చించారు. స్థానిక సహకారంపై కఠిన చర్యలకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశించారు. ఈసీ జమ్మూకశ్మీర్ లో ఎన్నికల నిర్వహణకు సమాయత్తం అవుతుండగా ఈ సమావేశం కీలక ప్రాధాన్యను సంతరించుకుంది. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో రక్షణ శాఖ ఏం వ్యూహం రూపొందిస్తుందో అనే చర్చ సర్వత్రా కొనసాగుతోంది.
ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ లతోపాటు, రా చీఫ్ అజిత్ ధోవల్ కూడా పాల్గొన్నారు.