రాహుల్ ఇన్ని పెట్టుబడులా!
Rahul so many investments!
- హిండెన్ బర్గ్ నివేదిక శుద్ధ తప్పే
- మోదీ ప్రభుత్వంపై బురదజల్లె ప్రయత్నం
- ఆరు నెలల్లో స్టాక్ మార్కెట్ లాభాలు రూ. 46.5 లక్షల కోట్లు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: హిండెన్ బర్గ్ నివేదికలు భారత వ్యాపారవేత్తలపై కొత్తేం కాదు. గతంలో కూడా చేసిన ఆరోపణలపై సెబీ దర్యాప్తు, సుప్రీం విచారణ కూడా జరిగి నివేదికలోని అంశాలు తప్పుల తడకలేనని నిర్ధరించాయి. అయినా రెండోసారి హిండెన్ బర్గ్ నివేదిక విడుదలపై విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున మరోమారు ఆరోపణలకు దిగాయి. కాగా ఈ నివేదికపై అమెరికా కూడా మండిపడింది. వాస్తవాలకు పొంతన లేని నివేదికలను విడుదల చేస్తూ ఒకదేశ ఆర్థిక స్థితిపై ప్రభావాన్నిచూపే చర్యలను మానుకోవాలని హితవు పలికింది.
ఇక ఈ నివేదికపై భారత్ లోని ప్రభుత్వాన్ని (మోదీ–బీజేపీ) ఇరకాటంలోకి నెట్టాలని రాహుల్ (కాంగ్రెస్) పార్టీ చాలా ప్రయత్నాలే చేసింది. వీరి ఈ చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం చూపుతున్నాయన్న ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించేలా ఉండడం గమనార్హం. అయితే ఈసారి మాత్రం వ్యాపార వర్గాలు రాహుల్ (కాంగ్రెస్–హిండెన్ బర్గ్) నివేదికలు శుద్ధ తప్పే అని నిరూపించారు. స్టాక్ మార్కెట్ల విశ్లేషకుల ప్రకారం భారతీయ స్టాక్ మార్కెట్లు గత ఐదు నెలల్లో రూ. 46.5 లక్షల కోట్లు లాభాలను చవిచూశాయి.
ఇన్ని ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ గురించి ఆర్థిక విశ్లేషకులు కొన్ని లెక్కలను బయటకు తీయగా ఈ విషయాలు బహిర్గతం అయ్యాయి. ఇంత నష్టాల్లో మార్కెట్లు కొనసాగితే మరీ మార్కెట్లో రాహుల్ గాంధీ పెట్టుబడులు ఎలా పెరిగాయని అందుకు సంబంధించిన లెక్కలను ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. ఈ వివరాలు చూస్తే స్వయానా రాహుల్ పార్టీలోని నేతలే నోరెళ్లబెట్టుకోలేక తప్పని పరిస్థితి. అదే సమయంలో భారత మార్కెట్లపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న వారికి కూడా సరైన సమాధానం దొరికినట్లవుతుంది.
ఈ లెక్కల ప్రకారం స్టాక్ మార్కెట్లో రాహుల్ గాంధీ పెట్టుబడులు ఎలా ఉన్నాయో చూద్దాం..
2024 లెక్కల ప్రకారం రాహుల్ ఆస్తులు రూ. 8.3 కోట్లు. స్టాక్ మార్కెట్లలో రూ. 4.3 కోట్లు, మ్యూచువల్ ఫండ్స్ లో రూ. 15 లక్షల గోల్డ్ బాండ్లు ఉన్నాయి. 2019 నుంచి ఆయన చరాస్థులవిలువ 59 శాతం పెరగడం గమనార్హ.
రాహుల్ గాంధీ పెట్టుబడి వివరాలు..
యంగ్ ఇండియన్ – రూ.100 చొప్పున 1,900 ఈక్విటీ షేర్లు – రూ. 1,90,000
ఆల్కైల్ అమైన్స్ కెమికల్ లిమిటెడ్ – 373 షేర్లు – రూ. 7,39,211
ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ – 1,231 షేర్లు – రూ. 35,29,954
బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ – 551 షేర్లు – రూ. 35,89,407
దీపక్ నైట్రేట్ లిమిటెడ్ – 568 షేర్లు – రూ. 11,92,033
డాక్టర్ లాల్ పాత్‌లాబ్స్ లిమిటెడ్ – 516 షేర్లు – రూ. 10,43,429
ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ – 211 షేర్లు – రూ. 8,56,301
దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ – 567 షేర్లు – రూ. 19,76,222
గార్వేర్ టెక్నికల్ ఫైబర్స్ లిమిటెడ్ – 508 షేర్లు – రూ. 16,43,075
జీఎంఎం లిమిటెడ్ – 1,121 షేర్లు – రూ. 14,00,073
హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ – 1,161 షేర్లు – రూ. 27,02,460
ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్ – 2,299 షేర్లు – రూ. 24,83,725
ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా) లిమిటెడ్ – 85 షేర్లు – రూ. 4,45,502
ఇన్ఫోసిస్ లిమిటెడ్ – 870 షేర్లు – రూ. 14,21,580
ఐటసీ లిమిటెడ్ – 3,093 షేర్లు – రూ. 12,96,276
ఎల్టీఐ మైండ్ ట్రీ లిమిటెడ్ – 407 షేర్లు – రూ. 21,14,100
మోల్డ్-టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ – 1,953 షేర్లు – రూ. 14,95,510
నెస్లే ఇండియా లిమిటెడ్ – 1,370 షేర్లు – రూ. 35,67,001
పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ – 1,474 షేర్లు – రూ. 42,27,432
సుప్రజిత్ ఇంజినీరింగ్ లిమిటెడ్ – 4,068 షేర్లు – రూ. 16,65,439
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్– 234 షేర్లు – రూ. 9,87,305
టైటాన్ కంపెనీ లిమిటెడ్ – 897 షేర్లు – రూ. 32,58,980
టీఐఓఐ లిమిటెడ్ – 340 షేర్లు – రూ. 12,10,621
వెర్టోజ్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్ – 260 షేర్లు – రూ. 1,89,085
వినైల్ కెమికల్స్ లిమిటెడ్ – 960 షేర్లు – రూ. 3,24,240
బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ – 5.5 ఎన్సీడీ – రూ. 1,558
హెచ్ డీఎఫ్ సీ ఎంకాప్ డీపీ జీఆర్ – రూ. 19,58,249
హెచ్ డీఎఫ్ సీ స్మాల్ క్యాప్ డీపీ జీఆర్ – రూ. 17,89,032
ఐసీఐసీఐ ఈక్విటీ – రూ. 19,03,179
పీపీఎఫ్ ఎఎస్ – రూ. 19,76,536
హెచ్ డె సీ స్మాల్ క్యాప్ – రూ. 1,23,85,545
హెచ్ డీఎఫ్ సీ హైబ్రిడ్ డెట్ ఫండ్ – రూ. 79,01,329
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రెగ్ సేవింగ్స్ – రూ 1,02,19,702
సావరిన్ గోల్డ్ బాండ్ – 220 యూనిట్లు - రూ. 15,21,740
ఒకవేళ రాహుల్ గాంధీ, హిండెన్ బర్గ్ ఆరోపణలు నిజమైతే ఇన్ని పెట్టుబడులు స్టాక్ మార్కెట్లో ఎందుకు పెట్టినట్లో ఆయనకే తెలియాలి. ఆయన సంపద దినదిన ప్రవర్థమానంగా వృద్ధి చెందుతూనే ఉండడం ఇక్కడ గమనించాల్సిన మరో అంశం. తన సంపదను మాత్రం పెంచుకోవాలి. మిగతా సంస్థల్లో పెట్టుబడిన పెట్టిన వారు మాత్రం నష్టపోవాలనే ఉద్దేశ్యం రాహుల్ (కాంగ్రెస్)వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపిస్తుంది.