స్కూల్​ బస్సులో మంటలు 25 మంది విద్యార్థులు మృతి

పలువురికి గాయాలు

Oct 1, 2024 - 13:32
 0
స్కూల్​ బస్సులో మంటలు 25 మంది విద్యార్థులు మృతి

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో పాఠశాల బస్సులో మంటలు చెలరేగడంతో విద్యార్థులతో సహా కనీసం 25 మంది మరణించారు. మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  అగ్నిమాపక దళం, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.   ప్రమాదంలో కాలిన గాయాల కారణంగా చాలా మంది గాయపడ్డారు, వారిని సమీప ఆసుపత్రిలో చేర్చారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా ఖచ్చితమైన సమాచారం వెల్లడి కాలేదు. మంటలను ఆర్పడంలో, బాధితులకు సహాయం చేయడంలో స్థానిక ప్రజలు కూడా రెస్క్యూ, రిలీఫ్ టీమ్‌లతో చేరి సహాయక చర్యలు చేపట్టడంతో మరింత ప్రాణనష్టం తప్పినట్లయ్యింది.