దేశంలో నరేంద్రుడు.. మహాలో దేవేంద్రుడు
Narendra in the country.. Devendra in Mahrashtra
ఫడ్నవీస్ సీఎం ప్రమాణ స్వీకారం
డిప్యూటీ సీఎంలుగా షిండే, పవార్
హాజరైన ప్రముఖ నేతలు, బాలీవుడ్ నటులు, వ్యాపారవేత్తలు
ముంబాయి: భారత రాజకీయాల్లో నరేంద్రుడు కీలకంగా మారగా, మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం దేవేంద్రుడు కీలకంగా మారాడు. ఆర్థిక రాజధాని మహారాష్ట్ర సీఎం పగ్గాలను ఫడ్నవీస్ చేపట్టారు.
మహారాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఫడ్నవీస్ తో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా ఏక్ నాథ్ షిండే (శివసేన), అజిత్ పవార్ (ఎన్సీపీ)లు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, బిహార్ సీఎం నితీష్ కుమార్ పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు సహా పలువురు నేతలు హాజరయ్యారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, వ్యాపారవేత్త అనంత్ అంబానీ, కుమార మంగళం బిర్లా సహా 200 మంది వీఐపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీఎం దేవేంద్ర ఫడ్నవీస్..
1970 జూలై 22న మహారాష్ట్ర నాగ్ పూర్ లో జన్మించారు. నాగ్ పూర్ యూనివర్సిటీ నుంచి ఎల్ ఎల్ బీ పట్టాను 1992లో అందుకున్నారు. నాగ్ పూర్ పశ్చిమ స్థానం నుంచి గెలుపొందిన ఈయన నాగ్ పూర్ మేయర్ గా కూడా విధులు నిర్వహించారు. 2013లో మహారాష్ర్ట బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికై బీజేపికి 122 స్థానాలను సాధించి పెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. 2014లో తొలిసారిగా మహారాష్ట్రకు సీఎంగా ఎన్నికయ్యారు. 2019లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేపట్టారు. అనంతరం జరిగిన పరిణామల నేపథ్యంలో బీజేపీ ప్రతిపక్ష నేతగా 2022వరకు కొనసాగారు. 2022లో మహాయుతి కూటమి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజాగా మూడోసారి ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర పగ్గాలు చేపట్టారు.
డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే..
శివసేన నుంచి వేరు పడ్డ ఏక్ నాథ్ షిండే అదే పార్టీ పేరుతో మహాయుతిలో చేరారు. 57 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈయన అట్టడుగు స్థాయి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆటో నడిపేవారు. ఉప ముఖ్యమంత్రిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేపట్టారు. 2004, 2009, 2014, 219, 2024లో డిప్యూటీ సీఎంగా ఎంపికయ్యారు.
అజిత్ పవార్..
శరద్ పవార్ తో వేరు పడి అజిత్ పవార్ (ఎన్సీపీ)కి కింగ్ పిన్ అయ్యారు. మహాయుతి కూటమి నేతృత్వంలో మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేశారు. నాలుగు సార్లు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. బారామతి స్థానం నుంచి వరుసగా ఏడోసారి విజయం సాధించారు. కూటమి నేతృత్వంలో మరోమారు డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకోగలిగారు.