చత్తీస్ గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​ 11 మంది నక్సలైట్ల ​మృతి కొనసాగుతున్న కూంబింగ్​

ఛత్తీస్ గడ్ లో నక్సలైట్లు, సాయుధ దళాలకు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరులో నక్సల్స్​కు భారీ ఎదురు దెబ్బ తగిలింది.  సోమవారం అర్థరాత్రి నుంచి రెండు వేర్వేరు చోట్ల కొనసాగుతున్న ఎన్​కౌంటర్​లో 11 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.

Apr 2, 2024 - 18:38
 0
చత్తీస్ గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​ 11 మంది నక్సలైట్ల ​మృతి కొనసాగుతున్న కూంబింగ్​

రాయ్​పూర్: ఛత్తీస్ గడ్ లో నక్సలైట్లు, సాయుధ దళాలకు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరులో నక్సల్స్​కు భారీ ఎదురు దెబ్బ తగిలింది.  సోమవారం అర్థరాత్రి నుంచి రెండు వేర్వేరు చోట్ల కొనసాగుతున్న ఎన్​కౌంటర్​లో 11 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఏకే 47 తుపాకులు, ల్యాండ్​మైన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు భద్రతాధికారులు తెలిపారు. సాయుధ దళాలు కూంబింగ్​ నిర్వహిస్తుండగా గంగులూరు ప్రాంతంలోని దళాలకు, నక్సలైట్లకు మధ్య సోమవారం రాత్రి 9 గంటల నుంచి కాల్పులు మొదలయ్యాయి. ఈ కాల్పులు సుధీర్ఘంగా కొనసాగాయి. 14 గంటలపాటు కొనసాగిన ఈ ఎన్​కౌంటర్​లో తొమ్మిది మంది నక్సలైట్లు మృతిచెందినట్లుగా పోలీసులు ప్రకటించారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్​కౌంటర్​ అనంతరం కూడా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో భారీ యెత్తున కూంబింగ్​ చేపట్టారు. ఎంపీ–ఛత్తీస్​గఢ్​ సరిహద్దు బాలాఘాట్​లో కూడా సాయుధదళాలు, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్​లో ఇద్దరు నక్సలైట్లు మృతిచెందినట్లు తెలిపారు. ఎన్​కౌంటర్​లో మృతి చెందిన నక్సలైట్లపై ిప్పటికే రివార్డు ప్రకటించారు. సజయంతి (క్రాంతి) రూ. 29 లక్షల రివార్డు, రఘు (షేర్​సింగ్) రూ. 14 లక్షల రివార్డులను మూడు రాష్ట్రాల పోలీసులు ప్రకటించారు. ఎన్​కౌంటర్​లో చనిపోయిన వీరిద్దరు కీలక నేతలుగా పేర్కొన్నారు. ఆయా చోట్ల జరిగిన ఎన్​కౌంటర్​లో పోలీసులు 8 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.