ఎయిర్ మార్షల్ చీఫ్ గా తేజిందర్ బాధ్యతల స్వీకరణ
Tejinder assumed responsibility as Air Marshal Chief
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నూతన ఎయిర్ మార్షల్ చీఫ్ గా తేజిందర్ సింగ్ ఆదివారం బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతల స్వీకరణకు ముందు న్యూ ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చం ఉంచి అమరులకు నివాళులర్పించారు. 1987న డిఫెన్స్ లో నియమితులైన ఈయన అంచలంచెలుగా ఎదిగి 4500 గంటలపాటు డిఫెన్స్ విమానాలను నడిపారు. ఫైటర్ స్క్వాడ్రన్, రాడార్ స్టేషన్, ప్రీమియర్ ఫైటర్ బేస్, జమ్మూ కాశ్మీర్‌లో కమాండింగ్ ఎయిర్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. తేజిందర్ సింగ్ సేవలను గుర్తించిన ప్రభుత్వం అతనికి 2007లో వాయుసేన పతకం, 2022లో అతి విశిష్ట సేవా పతకాలను అందించింది.