సీఎం నివాసంలో రౌడీలా?
మహిళతో ప్రవర్తన సిగ్గుగా లేదా? కేసుల గురించి సూచనలివ్వొద్దు బిభవ్ న్యాయవాది సింఘ్వికి మందలింపు బెయిల్ పై ఢిల్లీ పోలీసులకు నోటీసులు తదుపరి విచారణ ఆగస్టు 7కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సీఎం నివాసంలో ఇలాంటి రౌడీలను ఉంచిదెవరని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గురువారం రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంలో విచారణ జరిగింది. మహిళ, ప్రజాప్రతినిధితో ఇలా ప్రవర్తించినందుకు మీకు సిగ్గుగా లేదా? అని సుప్రీం నిలదీసింది.
జరిగిన తీరును చూసి దిగ్భ్రాంతికి గురయ్యామని సుప్రీంకోర్టు పేర్కొంది. రౌడీలకు సీఎం ఆఫీసులో ఏం పని అని ప్రశ్నించింది. సీఎం కార్యాలయంలో ఆ పార్టీ నాయకురాలికి ఉండే అవకాశం లేదా? మరీ మీకు ఉండే అవకాశం ఉందా? అని ప్రశ్నించింది.
కేసుల గురించి తమకు సూచనలు ఇవ్వొద్దని బిభవ్ కుమార్ న్యాయవాది సింఘ్విని మందలించింది. బెయిల్ ఇచ్చేందుకు ఈ విషయంలో ఎలాంటి నైతిక దృఢత్వం ఉంది? అని ప్రశ్నించింది. సీఎం ప్రభుత్వ గృహం వ్యక్తిగత నివాసమా అని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బెయిల్ విషయంపై ఢిల్లీ పోలీసులకు కూడా సుప్రీం న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 7కు వాయిదా వేశారు.