బీజేపీ ర్యాలీలో పెద్ద ఎత్తున చేరికలు
Large scale participation in BJP rally
హరియాణా: హరియాణాలో జింద్ జన్ ఆశీర్వాద్ ర్యాలీలో బీజేపీలోకి పెద్ద యెత్తున వలసలు ప్రారంభమయ్యాయి. ఆదివారం చేపట్టిన ఈ ర్యాలీలో రామ్‌కుమార్ గౌతమ్, జోగిరామ్ సిహాగ్, అనుప్ ధనక్ బీజేపీలో చేరారు. ఈ ర్యాలీకి సీఎం నాయబ్ సైనీ, రాష్ర్ట అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ నేతృత్వం వహించారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో అనూప్ ధనక్, రామ్‌కుమార్ గౌతమ్, జోగిరామ్ సిహాగ్, అంబాలా మేయర్ శక్తి రాణి శర్మ, వినోద్ శర్మ భార్య, ఎంపీ కార్తికేయ శర్మలు బీజేపీలో చేరారు. బీజేపీలో చేరికలతో కాంగ్రెస్ లో ప్రకంపనలు రేగుతున్నాయి. 90 అసెంబ్లీ స్థానాలున్న హరియాణాలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగిరేయాలన్న లక్ష్యంతో భారీ ఎత్తున చేరికలకు రంగం సిద్ధం చేసింది. ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తోంది.