కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటైతే రామ మందిరం నిర్ణయం వెనక్కు

రాహుల్​ సన్నిహితులు చెప్పారన్న ఆచార్య ప్రమోద్​ కృష్ణం సూపర్​ పవర్​ కమిటీ ఏర్పాటుతో నిర్ణయం రద్దు భారత్​ విచ్ఛిన్నానికి కాంగ్రెస్​ కుట్ర

May 6, 2024 - 15:16
 0
కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటైతే రామ మందిరం నిర్ణయం వెనక్కు

నా తెలంగాణ, న్యూఢిల్లీ: కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటు కాగా రామ మందిరంపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటానని రాహుల్​ గాంధీ తన సన్నిహితులతో చెప్పారని ఆ పార్టీ మాజీ నాయకుడు ప్రమోద్​ కృష్ణం పేర్కొన్నారు. సోమవారం ఈ విషయాన్ని ఆయన అయించోడ కాంబోలోని తన నివాసంలో మీడియా సాక్షిగా వెల్లడించారు. రామాలయంపై నిర్ణయం తీసుకున్న వెంటనే తాను రాహుల్​ సన్నిహితులతో భేటీ అయ్యానని తెలిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఓ సూపర్​ పవర్​ కమిటీని ఏర్పాటు చేస్తానని తెలిపినట్లు చెప్పారు. షా బానో నిర్ణయాన్ని రాజీవ్​ గాంధీ ఎలాగైతే తోసిపుచ్చారో అలాగే రామ మందిర నిర్ణయాన్ని రద్దు చేస్తానని వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. 32 ఏళ్లుగా తాను కాంగ్రెస్​ లో ఉన్నానని తనతో ఆ పార్టీ హై లెవెల్ సమావేశాల నిర్ణయాలు కూడా పలువురు పంచుకుంటారని తెలిపారు. 

రాహుల్​ గాంధీ అతని నేతృత్వంలని పలువురు భారత్​ ను విచ్ఛిన్నం చేసే కుట్రకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మునుపటి కాంగ్రెస్​ కు ప్రస్తుత కాంగ్రెస్​ కు ఆలోచనా రీతిలో చాలా తేడా ఉందని స్పష్టం చేశారు. ఈ కాంగ్రెస్​ హిందువులను పూర్తిగా అణగదొక్కాలని చూస్తుందని ఆరోపించారు.