కాంగ్రెస్​ అబద్ధాలతో అధికారంలోకి వచ్చింది: అన్నామలై

Annamalai said that Congress has cheated people in Telangana in the name of guarantees

May 6, 2024 - 15:41
 0
కాంగ్రెస్​ అబద్ధాలతో అధికారంలోకి వచ్చింది: అన్నామలై
  •  దేశ భవిష్యత్​ యువత చేతిలోనే: అన్నామలై
  •  బీఆర్​ఎస్​ కు బుద్ధి చెప్పినట్లే కాంగ్రెస్​ కూ చెప్పండి
  •  జమ్మికుంట యువ సమ్మేళనంలో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు

    నా తెలంగాణ, కరీంనగర్​: కాంగ్రెస్​ పార్టీ ఆరు గ్యారంటీలతో ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు. దేశ భవిష్యత్​ యువత చేతిలోనే ఉందని, దేశం కోసం మోదీ కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ మేరకు సోమవారం జమ్మికుంటలో కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ కు మద్దతుగా నిర్వహించిన యువ సమ్మేళనంలో అన్నామలై పాల్గొని మాట్లాడారు. ‘‘ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్​.. అధికారంలోకి వచ్చాక గాడిద గుడ్డు చూపిస్తున్నది. మోదీజీని రెండు నెలల క్రితం రేవంత్​ రెడ్డి బడే భాయ్​ అన్నారు. మూసీని గుజరాత్​ లోని సబర్మతి నదిలా మారుస్తామని అన్నారు. అంతలోనే ఇప్పుడు మాట మార్చి గాడిద గుడ్డు చూపిస్తున్నారు. తెలంగాణ యువత మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కుటుంబ పాలన సాగించిన బీఆర్​ఎస్​ ను గద్దె దించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. బండి సంజయ్​ కేవలం కరీంనగర్​ లీడర్​ మాత్రమే కాదు.. సౌత్​ ఇండియా లీడర్. బీఆర్​ఎస్​ ప్రజా వ్యతిరేక విధానాలపై బండి సంజయ్​ అలుపు ఎరుగని పోరాటం చేశారు. ఆయన ప్రజా సంగ్రామ యాత్రను మేము అధ్యయనం చేసి తమిళనాడులో చేపట్టాం. బండి సంజయ్​ గెలుపు యువత, పేదల పక్షాన కొట్లాడే గొంతుక అవుతుంది”అని తెలిపారు.