బంగ్లాలో దాడులపై ఆందోళన
Concern over the attacks in the bungalow
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి
వెంటనే చర్యలు తీసుకోవాలన్న ఎంఈఎ ప్రతినిధి
ఇస్కాన్ బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బంగ్లాదేశ్ లో మైనార్టీలే లక్ష్యంగా హిందువులపై జరుగుతున్న దాడులకు భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. శుక్రవారం ఎంఈఎ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటన విడుదల చేశారు. మైనార్టీలకు రక్షణ కల్పించాల్సిన అవసరం తాత్కాలిక ప్రభుత్వానికి ఉందన్నారు. హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నట్లు భారత్ బంగ్లాదేశ్ తో ఈ అంశాన్ని లేవనెత్తిందన్నారు. పెరుగుతున్న హింస, రెచ్చగొట్టే సంఘటనలపై భారత్ ఆందోళన చెందుతోందన్నారు. ఈ పరిణామాలు కొట్టిపారేయలేమన్నారు. ఇప్పటికైనా మైనార్టీలు, హిందువులపై దాడులను బంగ్లాదేశ్ ప్రభుత్వం అడ్డుకునే చర్యలను తీసుకోవాలని కోరారు.
మరోవైపు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇస్కాన్ సంస్థలకు చెందిన బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. ఇస్కాన్ ఆర్థిక లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని గుర్తించినట్లు పేర్కొంది. చిన్మోయ్ కృష్ణదాస్ విడుదలకు బంగ్లాలో శనివారం కూడా నిరసనలు కొనసాగాయి. ఓ వైపు ముష్కరులు హిందువులు, మైనార్టీలపై దాడులు చేస్తున్న ఐక్యతగా నిలబడి నిరసనలు కొనసాగిస్తున్నారు.
..............