18న కోయంబత్తురుకు మోదీ

ప్రధాని నరేంద్రమోదీ మార్చి 18న కోయంబత్తూరులో పర్యటించనున్నారు.

Mar 17, 2024 - 16:29
 0
18న కోయంబత్తురుకు మోదీ

చెన్నై: ప్రధాని నరేంద్రమోదీ మార్చి 18న కోయంబత్తూరులో పర్యటించనున్నారు. పీఎంవో వర్గాలు ఆదివారం ప్రధాని పర్యటన వివరాలను ప్రకటనలో పంచుకున్నాయి. బీజేపీ దేశ వ్యాప్త ఎన్నికల నేపథ్యంలో కోయంబత్తులో ప్రధాని ప్రచారసభలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు కర్ణాటక రాష్ర్టం శివమొగ్గ నుంచి విమానంలో బయలుదేరి కోయంబత్తురు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్​షోలో పాల్గొంటారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 6.45 ప్రచార సభ ముగియనుంది. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు కోయంబత్తూరు ప్రభుత్వ అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. మార్చి 19 ఉదయం 9.30 గంటలకు కారులో బయలుదేరి కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాప్టర్‌లో కేరళ రాష్ట్రం పాలక్కాడుకు వెళ్లి ఉదయం 11.40 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఒంటి గంటకు పాలక్కాడు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 1.50 గంటలకు సేలం నగరానికి చేరుకుంటారు. సేలంలో బీజేపీ ప్రచార బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.25 గంటలకు ఆయన విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళతారు.