లెబనాన్ లోకి ఐడీఎఫ్
ముప్పేట దాడులు దిక్కుతోచని స్థితిలో ఉగ్రవాద ముఠాలు
జెరూసలెం: ఇజ్రాయెల్ లెబనాన్ లోని హిజ్బొల్లా, హమాస్, హౌతీ ఉగ్రవాదులపై ముప్పేట దాడి జరుపుతోంది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉగ్రవాద ముఠా నాయకులున్నారు. సోమవారం అర్థరాత్రి భారీ ఎత్తున యుద్ధట్యాంకులో లెబనాన్ లోని ప్రవేశించాయి. సరిహద్దు నుంచి భూతల సైన్యం కూడా లెబనాన్ లోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఒకేసారి నాలుగు దేశాలను ఎదుర్కొంటోంది. ఇరాన్, లెబనాన్, సిరియా, గాజాలలో ఉన్న ఉగ్రస్థావరాలను ధ్వంసం చేస్తూ ముందుకు వెళుతోంది. మరోవైపు ఆకాశమార్గం ద్వారా బీరూట్ లోని హిజ్బొల్లా, హమాస్ స్థావరాలపై ఐడీఎఫ్ విరుచుకుపడుతుంది. హౌతీ ఉగ్రవాదులపై సముద్ర ప్రాంతం నుంచి దాడులను కొనసాగిస్తుంది. దీంతో ఉగ్రకమాండర్లకు వీరి దాడులు వణుకు పుట్టిస్తున్నాయి. ఐడీఎఫ్ భారీ దాడులకు పూనుకుంటోంది. రాత్రి నుంచి విరామం లేకుండా దాడులు కొనసాగిస్తూ పెద్ద పెద్ద భవంతులనే లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ దాడుల్లో ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు. ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్ తీవ్ర ఆందోళనలో ఉంది.