భోజ్షాలాపై పిటిషన్ తిరస్కరించిన సుప్రీం
హైకోర్టును ఆశ్రయించాలని సూచన
భోపాల్: భోజ్షాలా మసీదు ఏఎస్ఐ సర్వే పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నో చెప్పింది. ఈ అంశంపై మధ్యప్రదేశ్హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. సర్వే నిలుపుదలపై సుప్రీంలో మసీదు కేర్ టేకర్‌గా ఉన్న ఖాజీ మొయినుద్దీన్అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషన్ విచారణపై సోమవారం కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. అనుమతి లేకుండా సర్వే ఫలితాల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న సుప్రీం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఏఎస్ఐలకు నోటీసులు జారీ చేసి 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సర్వే సందర్భంగా ఎలాంటి తవ్వకాలు జరపవద్దని, చారిత్రక ఆధారాలకు ఎలాంటి నష్టం వాటిల్లనీయవద్దని కోర్టు స్పష్టం చేసింది. భోజ్షాలా మసీదు హిందువులకు సంబంధించిన దేవాలయమని ఇందులో చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని హిందు పక్షం హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఏఎస్ఐ సర్వేకు కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.