పాక్​ కు ఐఎంఎఫ్​ ఝలక్​ 

IMF Jhalak to Pakistan

Sep 13, 2024 - 20:57
 0
పాక్​ కు ఐఎంఎఫ్​ ఝలక్​ 

ఋణం మంజూరు ఆలస్యం
సెప్టెంబర్​ 25న బోర్డు సమావేశలో నిర్ణయం


ఇస్లామాబాద్​: ఐఎంఎఫ్​ (అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ–ఇంటర్నేషనల్​ మోనిటరింగ్​ ఫండ్​) ఋణం మంజూరైందని సంతోషంలో ఉన్న పాక్​ కు ఆ సంస్థ ఝలక్​ మీద ఝలక్​ లు ఇస్తుంది. 7 బిలియన్​ డాలర్ల బెయిలవుట్​ ప్యాకేజీపై అంగీకారం కుదిరినప్పటికీ అది అందేందుకు మరో రెండు మూడు నెలలు పట్టనుంది. ఈ ఋణం అందేందుకు ఐఎఎఫ్​ సవాలక్ష షరతులను విధించింది. ఈ నేపథ్యంలో రుణం మంజూరుకు మరింత ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో ఋణం మంజూరులో కావాలనే ఐఎంఎఫ్​ జాప్యం చేస్తుందని ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్​ దార్​ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పలు ఆరోపణలు చేశారు. ఋణం మంజూరైనప్పటిఈ ఐఎంఎఫ్​ ఎగ్జిక్యూటీవ్​ బోర్డు నుంచి ఇంఆ ఆమోదం పొదలేదన్నారు. పాక్​ కు ఋణం ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై సెప్టెంబర్​ 25న కీలక బోర్డు కీలక సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. బోర్డు ఆమోదం లభిస్తే 37 నెలల్లో విడతల వారీగా ఐఎంఎఫ్​ బెయిలవుట్​ ప్యాకేజీ కింద పాక్​ కు 7 బిలియన్​ డాలర్ల ఋణాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు.